You are here: Home / Access to Knowledge / Blogs / వికీపీడియా:సమావేశం/గుంటూరు/అన్నమయ్య గ్రంథాలయం - భాగస్వామ్య కార్యక్రమం జూలై 2018

వికీపీడియా:సమావేశం/గుంటూరు/అన్నమయ్య గ్రంథాలయం - భాగస్వామ్య కార్యక్రమం జూలై 2018

Posted by Admin at Jul 10, 2018 09:05 PM |
CIS-A2K partnership activity in Annamayya Library, Guntur.

See the event details on Wikipedia page here


వికీపీడియా నుండి < వికీపీడియా:సమావేశం Jump to navigation Jump to search

2018 జూలై 10న గుంటూరు అన్నమయ్య గ్రంథాలయంలో భాగస్వామ్య అవకాశాలను గురించి జరిపిన చర్చలు, చేసిన చిరు శిక్షణల సారాంశం.

వివరాలు

  • తేదీ-సమయం: 2018 జూలై 10న ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకూ
  • ప్రదేశం: అన్నమయ్య గ్రంథాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా, బృందావన కాలనీ, గుంటూరు

పాల్గొన్న వ్యక్తులు

చేపట్టిన పనులు, భాగస్వామ్య చర్చలు

  • అన్నమయ్య గ్రంథాలయానికి సంబంధించిన లక్షా మూడువేల పుస్తకాల కేటలాగును ఇప్పటికే వికీపీడియాలోకి కొంతమేరకు విశ్వనాథ్ గారు, కొంతమేరకు సీఐఎస్-ఎ2కె వారు, రహ్మానుద్దీన్ ప్రభృతులు పూర్తిచేశారు. అయితే ఆపైన నిరంతరం పుస్తకాలు చేరుతూ జాబితా అప్‌డేట్ అవుతూండడాన ఆ పుస్తకాలు చేర్చడానికి గ్రంథాలయ సిబ్బందికి శిక్షణనివ్వాల్సిందిగా ఆహ్వానించారు.
  • గ్రంథాలయ సిబ్బందిలో ఒకరైన గోపి మొగిలికి స్ప్రెడ్‌షీట్లలోని కాటలాగ్ వికీ మార్కప్ కోడ్‌లోకి తీసుకురావడానికి ఉపకరించే వెబ్‌సైట్ చూపి శిక్షణను ఇచ్చాం. తద్వారా భావి గ్రంథాలయ సూచికలన్నీ వికీపీడియాలోకి వచ్చేందుకు వీలవుతుంది.
  • గ్రంథాలయ వ్యవస్థాపకుడు లంకా సూర్యనారాయణ వికీపీడియాలో తమ కాటలాగ్ డిజిటైజ్ చేసి, తద్వారా పరిశోధకులకు గ్రంథాల అందుబాటుకు వీలుకల్పించిన వికీపీడియా వాలంటీర్లను, పాల్గొన్న సంస్థల ఉద్యోగులను ప్రశంసిస్తూ తమ గ్రంథాలయం ద్వారా తెలుగు వికీపీడియా సముదాయ అభివృద్ధికి ఏయే కార్యకలాపాలు చేపట్టవచ్చో ఆలోచించి ప్రతిపాదించమని కోరారు.
  • ఈ నేపథ్యంలో గుంటూరు సమీపంలోని వీవీఐటీ కళాశాలలో వాడుకరి:KCVelaga పలు కార్యకలాపాలు చేపడతున్నందను, వారి భాగస్వామ్యంతో గుంటూరులో గ్రంథాలయంలో నెలవారీ సమావేశాలు నిర్వహించడం ప్రారంభిద్దామని, గ్రంథాలయంలోని గ్రంథాలు స్కాన్ చేయడంలో వీవీఐటీ వికీ క్లబ్ సభ్యులకు శిక్షణనిచ్చి కాపీహక్కులు లేని గ్రంథాలు కొన్ని వికీమీడియా కామన్స్‌లోకి తీసుకురావచ్చనీ ఆలోచిస్తూ ఆయా ప్రతిపాదనలు గ్రంథాలయం ముందుంచనున్నాం.