Project Tiger 2.0
The blog post by Suswetha Kolluru and Nitesh Gill is in multiple languages: English, Punjabi, Hindi and Telugu.
భారతీయ భాషలు కూడా ఆంగ్లం వంటి అంతర్జాతీయ భాషలతో సమానంగా ముఖ్యమైనవి అని మీరు అనుకుంటే ఈ వ్యాసం మీరు తప్పకుండ చదవాలి. ఒక వేళా మీకు అలా అనిపించకపోతే, ఈ విషయం ఎంత ముఖ్యమైనది మరియు పెద్దది అని చెప్తాను చూడండి. ప్రతి రోజు లక్షల మంది వినియోగదారులు అంతర్జాలం నుండి సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటారు. భారతదేశంలో, మాతృభాషలో సమాచారాన్ని పొందడానికి ప్రయత్నించే వినియోగదారుల సంఖ్య అధికంగా ఉంది. 2021వ సంవత్సరం నాటికీ, హిందీ వినియోగదారుల సంఖ్య ఆంగ్ల వినియోగదారుల సంఖ్యను అధిగమిస్తుందని మరియు మరికొన్ని భారతీయ భాషలు అంతర్జాలంలో 30% వినియోగదారులను కలిగి ఉంటాయని అధ్యయనం చెబుతుంది. 68% అంతర్జాల వినియోగదారులు ఆంగ్ల భాష సమాచారం కంటే స్థానిక భాషా సమాచారం నమ్మదగినదిగా భావిస్త్తున్నారని పరిశోధన పేర్కొనింది.
ఈ వాస్తవాలు అన్నీ ఉన్నప్పటికీ, భారతీయ భాషలలోని సమాచారాన్ని పొందకుండా వినియోగదారులను పరిమితం చేసే ఒక ప్రధాన కారణం, ఆన్‌లైన్‌లో కనిపించే భారీ జ్ఞాన అంతరం. గూగుల్ యొక్క పరిశోధనా బృందం భారతీయ భాషలలో అంతర్జాలంలో ఎక్కువగా శోధించిన మరియు తప్పిపోయిన అంశాల ఫలితాలను విశ్లేషించినప్పుడు, వారు వికీమీడియా ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నారు మరియు ప్రాజెక్ట్ టైగర్ అనే పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. దీనిని 2017లో, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ - యాక్సిస్ టు నాలెడ్జ్ వారి సహకారంతో భారతీయ వికీమీడియన్లను తమ స్థానిక భాషలో నాణ్యత గల సమాచారమును అభివృద్ధి చేయటంలో ప్రోత్సహించడానికి ప్రారంభించారు.
ప్రాజెక్ట్ టైగర్ అనేది భారత దేశంలో పులులను రక్షించడం కోసం ప్రారంభించిన పర్యావరణ ప్రాజెక్ట్. దానిని స్ఫూర్తిగా తీసుకోని వికీపీడియా యొక్క ప్రాజెక్ట్ టైగర్ భారత దేశపు స్థానిక భాషలను సంరక్షించుకుంటూ స్థానిక భాషా వికీపీడియాలలో నాణ్యమైన సమాచారమును అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ రెండు దశల్లో జరుగుతుంది: ప్రాజెక్ట్ టైగర్ 2018 లో భాగంగా గూగుల్, వ్యాసాల రచనలను పెంచడానికి సాంకేతిక సహకారం అవసరమయ్యే అనుభవజ్ఞులైన వికీమీడియన్లకు మరియు ఆశాజనక వికీమీడియన్లకు 50 క్రోమ్‌బుక్‌లు మరియు 100 ఇంటర్నెట్ స్టైపెండ్‌లను అందచేయడం జరిగింది. పంపిణీ పూర్తయిన తర్వాత, కమ్యూనిటీలు గూగుల్ అందించిన జాబితా నుండి కథనాలను సృష్టించడం ప్రారంభించాయి.
2018 లో జరిగిన ప్రాజెక్ట్ టైగర్ యొక్క మొదటి పునరావృతంలో, 12 భారతీయ కమ్యూనిటీలు మార్చి నుండి మేల వరకు 3 నెలలు జరిగిన వ్యాస రచన పోటీలో పాల్గొని, మొత్తం 1,65,774 పేజీ వీక్షణలతో 4,466 వ్యాసాలను సృష్టించాయి! ప్రతి వ్యాసాన్ని సంబంధిత భాషా జ్యూరీ సభ్యుడు పారామితుల ప్రకారం సమీక్షిస్తారు. ఒక వ్యాసం అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే అది అంగీకరించబడుతుంది. ఈ పోటీలో పంజాబీ కమ్యూనిటీ 1320 వ్యాసాలతో విజయం సాధించింది, తమిళ కమ్యూనిటీ 1241 వ్యాసాలతో రెండవ స్థానంలో ఉంది.
ప్రతి కమ్యూనిటీ నుండి మొదటి మూడు స్థానాలలోవచ్చినవిజేతలకు ఇచ్చే నెలవారీ బహుమతులతో పాటు, గెలిచిన మరియు రన్నరప్ కమ్యూనిటీలు పంజాబ్‌లోని అమృత్సర్‌లో 3 రోజుల శిక్షణను పొందారు. ఈ ట్రైనింగ్సెషన్కు యూజర్: అసఫ్ (WMF) నాయకత్వం వహించారు, అక్కడ అతను ఎన్సైక్లోపెడిక్ విలువతో వ్యాసాలు రాయడం గురించి పాల్గొనేవారికి నేర్పించాడు మరియు వికీడేటా మరియు అందులో ఉపయోగించిన సాధనాలను కూడా పరిచయం చేశాడు.
2018 లో ప్రాజెక్ట్ టైగర్ యొక్క భారీ విజయాన్ని చూసిన తరువాత, రెండవ పునరుక్తిని ప్రాజెక్ట్ టైగర్ 2.0 లేదా గ్లో (వికీపీడియాలో పెరుగుతున్న స్థానిక భాషా కంటెంట్) అని ప్రారంభించారు. భారతదేశంతో పాటు మరో రెండు దేశాల్లో ఇది మొదటిసారి నడుస్తోంది. ఇంతకుముందు పాల్గొన్న 12 భాషా సంఘాలతో పాటు, సంతాలి మరియు సంస్కృతం కూడా ఈ సంవత్సరం పోటీలో పాల్గొనడానికి అంగీకరించాయి. కమ్యూనిటీలు వ్రాయడానికి వారి స్వంత కథనాల సమితితో పాటు గూగుల్ ఇచ్చిన జాబితాతో వస్తున్నాయి. ఈ సంవత్సరం, ఈ ప్రాజెక్ట్ అధిక నాణ్యత కలిగిన కథనాలను లక్ష్యంగా పెట్టుకుంది. మరియు అన్నీ కమ్యూనిటీల వారు కూడా అదే విధంగా చేయటానికి కట్టుబడి ఉన్నాయి.
మీరు పోటీలో చేరడానికి ఆసక్తి కలిగి ఉంటే, దయచేసి ఈ లింకును సందర్శించండి
https://meta.wikimedia.org/wiki/Growing_Local_Language_Content_on_Wikipedia_(Project_Tiger_2.0)