వికీపీడియా:సమావేశం/హైదరాబాద్/ఆగష్టు
Click to read the original published by Telugu Wikipedia here
తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది.
వివరాలు
- ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్ అబిడ్స్, హైదరాబాద్
- తేదీ : 25:08:2013; సమయం : 3 p.m. నుండి 6 p.m. వరకూ.
చర్చించాల్సిన అంశాలు
- హాంక్‌కాంగ్ లో జరిగిన 2013 వికీమానియా విశేషాలు - విష్ణు
- తెవికీ నాణ్యతకు వికీపీడియా ఉపకరణాలు - ECHO; AFT; VISUAL EDITOR - విష్ణు
- తెలుగు రంగస్థలం - వికీపీడియా - ప్రణయ్ రాజ్, రామారావు మరియు శేఖర్ బాబు.
- తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు సమీక్ష - రాజశేఖర్
- వ్యాసరచన పోటీ సమీక్ష - పోటీలో విజేతలకు బహుమతుల ప్రదానం.
- వికీసోర్సులో s:పోతన తెలుగు భాగవతము చేర్చే పని యొక్క ప్రస్తుత పరిస్థితి.
- విక్షనరీలో నెలవారీ కార్యక్రమ ప్రణాలిక.
- ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు
సమావేశం నిర్వాహకులు
- Rajasekhar1961 (చర్చ) 13:12, 17 ఆగష్టు 2013 (UTC)
- పైన మీ పేరు చేర్చండి
సమావేశానికి ముందస్తు నమోదు
(నమోదు తప్పనిసరికాదు కాని నిర్వాహకులకు సహాయంగా మరియు ఇతరులకు ప్రోత్సాహంగా వుంటుంది. పైన మార్చు నొక్కి మీ పేరు చేర్చవచ్చు)
- తప్పక
- వాడుకరి:Maheshwar Reddy (చర్చ) 12:05, 22 జూలై 2013 (UTC)
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- Skype ద్వారా చర్చలో పాల్గొనదలచినవారు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- బహుశా
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- పాల్గొనటానికి కుదరని
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- స్పందనలు
- <పై వరసలో స్పందించండి>
నివేదిక
- స్కైప్ ద్వారా విష్ణుగారు పాల్గొని హాంక్‌కాంగ్ లో జరిగిన 2013 వికీమానియా విశేషాలు, వికీపీడియా అభివృద్ధికోసం జరిగిన చర్చల గురించి తెలియజేశారు.
అనంతరం ఈ క్రింది అంశాల గురించి వివరించారు.
- తెలుగు వికీపీడియాకు గ్లోబల్ లెవల్ లో గుర్తింపులేదు. తెవికీలో ఉన్న ప్రాజెక్టులలోని కొన్ని వ్యాసాలను (పల్లెవాసుల జీవన విధానం మొ.) ఆంగ్లంలోనికి అనువదించి, ఆంగ్ల వికీపీడియాలో చేర్చడంద్వారా గ్లోబల్ లెవల్ లో గుర్తింపు తీసుకురావడం. వచ్చే వికీమానియాలో తెలుగు వికీపీడియాకు ప్రముఖస్థానం వచ్చేలా కృషిచేయడం.
- లీలావతి డాటర్స్ అనే పుస్తకంలోని 64 మంది మహిళా సైంటిస్టుల గురించి వ్యాసాలను రాయడం.
- తెలుగు వికీపీడియాలో చురుగ్గా పనిచేస్తున్న ఇంజనీర్స్ ను తెలుగు వికీపీడియా మెంటర్స్ గా తయారుచేయడం.
- తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడే ప్రాజెక్టులను ఎంపికచేసుకొని, ఆ ప్రాజెక్టుల నిర్వాహణకు గ్రాంట్ వచ్చేలా చూడడం.
- తెవికీ నాణ్యతకు వికీపీడియా ఉపకరణాల ఉపయోగాలు. 1. ECHO (Notification Tool, రాసిన వ్యాసాల గురించిన సవరణలను చూపించే ఉపకరణం). 2. AFT (Article Feedback Tool, వీక్షకులు, పాఠకులు తమ అభిప్రాయాలను రాసే ఉపకరణం). 3. VISUAL EDITOR (వ్యాసాన్ని వ్యాసపు పేజీలోనే సవరించేందుకు ఉపకరణం).
- వచ్చే నెలలో తెలుగు రంగస్థలంపై ప్రాజెక్టు నిర్వహించదలచామని రాజశేఖర్ గారు ప్రతిపాదించగా, రంగస్థలానికి చెందినవారిని వాడుకరులుగా చేర్పించి వారితో వ్యాసాలను రాయించాలనీ, అందుకోసం రంగస్థల అధ్యాపకులైన పెద్ది రామారావు గారి సహయం తీసుకుందామని విష్ణుగారు సూచించారు.
- వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతుల ప్రధానంకోసం, ఎంపికైనవారు వారివారి చిరునామాను పంపించవలసిందిగా వారి వాడుకరి/వ్యాసపు పేజీలో రాయడం.
- వికీసోర్సులో s:పోతన తెలుగు భాగవతము చేర్చే పనిలో భాగంగా 4 స్కంధాలు పూర్తయ్యాయని, మిగతావి మరో వారం రోజుల్లో పూర్తి చేస్తానని రాజశేఖర్ గారు చెప్పారు.
- రావూరి భరద్వాజ గారి గురించి, ఆయన రచనల గురించి తెవికీలో రాయడంపై బొగ్గుల శ్రీనివాస్ తో రాజశేఖర్ గారు చర్చించగా, తన వద్దవున్న సమగ్ర సమాచారాన్ని అందించగలనని శ్రీనివాస్ హమీ ఇచ్చారు.
సమావేశంలో పాల్గొన్నవారు
- విష్ణు (Skype ద్వారా)
- Rajasekhar1961
- గుళ్లపల్లి నాగేశ్వరరావు
- Pranayraj1985
- బొగ్గుల శ్రీనివాస్